అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలో ఎందుకు చర్యలు చేపట్టలేదని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏపీలో హిందూ ఆలయాలకు వెళ్లాలంటే ప్రవేశ టిక్కెట్ పెట్టడం దారుణమని రఘురామకృష్ణరాజు అన్నారు. భగవంతుడిని సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందని వ్యాఖ్యానించారు.
తితిదే బ్రహ్మోత్సవాల్లో సీఎం సతీసమేతంగా ఎందుకు పాల్గొనట్లేదని రఘురామ ప్రశ్నించారు. హిందూ ధర్మ పరిరక్షణకు 'సనాతన స్వదేశీ సేన' సంస్థ స్థాపించినట్లు ప్రకటించారు. జగన్ రమ్మంటేనే తాను వైకాపాలోకి వచ్చినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని ఆలయాలకు పటిష్ట భద్రత: డీజీపీ