RRR on YS Viveka Case: ఇప్పుడిప్పుడే వేగం అందుకున్న వివేకా హత్య కేసు విచారణకు వైకాపా పెద్దలు సహకరించాలని.. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. దర్యాప్తునకు జాప్యం కలిగించేలా.. అనవసరమైన కేసులు వేయొద్దని వ్యాఖ్యానించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉండడంపై.. రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీబీఐకీ మా పార్టీ అంటే కోపమెందుకుంటుందో నాకు తెలీదు. విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి కానీ.. ముఖ్యమంత్రి బాధైతే వర్ణణాతీతం. నిన్నటి ఛార్జ్‌షీట్‌లో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని.. అనుమానమన్నారు. కొంతమంది వారి కుమార్తె, అల్లుడి మీద అనుమానం వచ్చేలాగా.. వాళ్లు, వీళ్లతో పోలీస్ కంప్లైంట్లు ఇప్పించి చాలా చేశారు. మరెన్నో ట్రిక్కులు చేశారు. అయినా సరే సీబీఐ వాళ్ల ఛార్జ్‌షీట్‌లో అంత స్పష్టంగా పలానా వాళ్ల మీద అనుమానముందని అన్నారు. కచ్చితంగా అలాగా జరగకూడదు. రూ.40కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఎవరికుంది? ఎవరు లేపారో.. వాళ్ల వివరాలున్నాయి. కాగితాలు దొరికాయి. చంపించింది ఎవరు? రూ.40కోట్లు ఖర్చుపెట్టి చంపించాలంటే.. ఆ వ్యక్తి ఎంత ధనవంతులై ఉండాలి. అంత ధనం ఎవరికి ఉండి ఉండొచ్చు. ఆ అవసరం ఎందుకొచ్చుండొచ్చు? ఇవన్నీ కూడా.. కేసు దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది కాబట్టి రేపో మాపో తెలుస్తుంది. సీబీఐ వాళ్లు డైరెక్ట్‌గా ఛార్జ్‌షీట్ వేసిన తరువాత ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలున్నాయి. కాబట్టి నిష్పక్షపాతంగా అది జరిగేలాగా మీరు సహకరించగలిగితే.. ఎందుకంటే పార్టీకి చెడ్డపేరు రాకూడదు. ఇలాంటి వాటికి పార్టీ పెద్దలు ఆమడ దూరంలో ఉన్నారనే నేనంటుకుంటున్నాను. ఉండాలి కూడా. -రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇదీ చదవండి:
YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్.. సీబీఐపై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు