ETV Bharat / city

విద్యార్థుల భవిష్యత్తుతో.. జగన్ చెలగాటమాడుతున్నారు: ప్రత్తిపాటి - ప్రత్తిపాటి పుల్లారావు న్యూస్

ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. విద్యాదీవెన నిధుల్ని కళాశాలలకు, తల్లిదండ్రులకు సక్రమంగా ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి
మాజీ మంత్రి ప్రత్తిపాటి
author img

By

Published : May 5, 2022, 3:57 PM IST

విద్యాదీవెన నిధుల్ని కళాశాలలకు, తల్లిదండ్రులకు సక్రమంగా ఇవ్వకుండా సీఎం జగన్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నిర్వాకంతో 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆరోపించారు. దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం న్యాయస్థానం ఆదేశాలను తుంగలోతొక్కిన వైకాపా ప్రభుత్వం.. అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో వెళుతోందని మండిపడ్డారు.

18 ఎంపీటీసీ స్థానాలకు తెదేపా 9, జనసేన 1 స్థానం గెలిస్తే.. వైకాపాకు ఎంపీపీ పీఠం ఎలా దక్కుతుందని పుల్లారావు ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసి ఎంపీపీ పీఠం దక్కించుకున్నా.. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే తీరుతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డిలో నిరాశానిస్పృహలు, అసూయద్వేషాలు పెరిగిపోబట్టే.. ప్రతిపక్షంపై, ప్రసారమాధ్యమాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.