ETV Bharat / city

ఆర్థికశాఖ వల్లే.. ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం: ఉద్యోగ సంఘాలు

PTD EMPLOYEES FIRES ON FINANCE DEAPRTMENT : ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌, ఏపీ ఐకాస డిమాండ్‌ చేశాయి. పది రోజుల్లోగా సమస్య పరిష్కరించకుంటే..కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశాయి. విజయవాడ రెవెన్యూ భవన్‌లో సమావేశమైన ఉద్యోగ సంఘాలు..కొత్త పీఆర్సీ జీవోల అమలులో ఆర్థికశాఖ తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.

PTD EMPLOYEES FIRES ON FINANCE DEAPRTMENT

author img

By

Published : Sep 3, 2022, 5:23 PM IST

PTD EMPLOYEES ANGRY ON FINANCE DPARTMENT : రాష్ట్రంలోని ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందకపోవడానికి ఆర్థికశాఖ నిర్లక్ష్యమే కారణమని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ ఐకాస అమరావతి, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్తు, సెక్యూరిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాల గురించి కూలంకుషంగా చర్చించారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతన సవరణ ఒప్పందం ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు అందాల్సి ఉన్నప్పటికీ.. మార్చి వరకు ఉత్తర్వులు వెలువడకపోవడానికి ఆర్థికశాఖే కారణమని ఆరోపించారు.

2096 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారనే సాకు చూపించి పీఆర్సీ అమలును వాయిదా వేస్తుండడం సరికాదని.. వారిని మినహాయించి ఇతరులకు కొత్త వేతనాలు అమలు చేయాలనే ఆలోచన కూడా అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. సుమారు 52 వేలమంది పీటీడీ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేయడమే కాకుండా వారికి మనోవేదన కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. పీటీడీ అధికారులు జూన్‌ ఆరో తేదీ నుంచి తరచూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు అనేక లేఖలు పంపుతున్నా.. ఏ లేఖకు ఆ శాఖ నుంచి సమాధానం, స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజారవాణా శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు జీతాల నిర్ణయానికి, చెల్లింపులకు ప్రత్యేకంగా అధికారులను నియమించినా.. వారి సేవలు వినియోగించుకోవడం లేదని.. అలాగే ఈ శాఖలోని సాఫ్ట్‌వేర్‌ను సీఎంఎఫ్‌ఎస్‌తో అనుసంధానించి త్వరితగతిన పని ముందుకు సజావుగా సాగేలా చూడడంలోనూ అంతులేని అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లోగా ఆర్థికశాఖ స్పందించి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని.. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఎలాంటి కార్యాచరణ ప్రకటనకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.

ఆర్థికశాఖ అధికారుల వల్లే.. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ వేతనాలు అందడం లేదు

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.