విప్లవ కవి కామ్రేడ్ పెద్ది కృష్ణ సంస్మరణ సభ సందర్భంగా ఫాసిజం - ప్రజాస్వామ్య కర్తవ్యాలు అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సొంత పార్టీ అయినా... నిర్బంధించటం నాటి ఫాసిజమయితే... ముస్లిం, మైనారిటీలంతా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రీకరించి దోషులుగా నిలబెట్టడం నేటి ఫాసిజమని ప్రొఫెసర్ హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ ముసుగులో ముస్లింలను ద్వేషించటమే హిందూ మతంలాగా మన దేశంలో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సాధారణ హిందువులు మతాన్ని చూడరని... మతం పేరుతో ఓటు బ్యాంకు తయారు చేసుకోవడానికి రాజకీయనేతలు ఈ తరహా పోకడలకు పోతున్నారన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావటం వాటిని వ్యతిరేకిస్తే నిర్బంధించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా పోకడలు చాలా ప్రమాదకరమైనవి అని వ్యాఖ్యనించారు. ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: