విజయవాడ దుర్గగుడిలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన ఈవో సురేశ్ బాబును సస్పెండ్ చేయకుండా బదిలీ చేయటం దుర్మార్గమని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. 16 మంది ఉద్యోగులను బలితీసుకున్న ఈవోను బదిలీ చేసి చేతులు దులుపుకుంటారా..? అని ప్రశ్నించారు. ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లి బినామీ అని.. వీరికి ఒక స్వామీజీ ఆశీస్సులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు.
మంత్రిగా వెల్లంపల్లి ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి నేటి వరకు ప్రభుత్వం అన్ని దస్త్రాలను పరిశీలించి మంత్రి అవినీతిని బహిర్గతం చేయాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రి వెల్లపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి...
ఆన్లైన్లో మార్చి నెల తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు