ETV Bharat / city

'వైకాపాకు ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యం'

ప్రపంచ దేశాలన్నీ లాక్​డౌన్ పాటిస్తుంటే వైకాపా నేతలు మాత్రం బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు. వారికి ప్రజల ప్రాణాల కన్నా..రాజకీయాలే ముఖ్యమని దుయ్యబట్టారు.

మాజీమంత్రి దేవినేని
మాజీమంత్రి దేవినేని
author img

By

Published : Apr 5, 2020, 8:28 PM IST

వైకాపా నేతలకు ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ లాక్​డౌన్ పాటిస్తుంటే వైకాపా నేతలు బహిరంగ సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర జనాభాలో మూడు వేల మందికే పరీక్షలు చేశారన్నారు. మెడ్ టెక్​జోన్​ను మూసేసి ఏం సాధించారని ప్రశ్నిించారు. నేడు మెడ్​టెక్ జోన్ దేశం మొత్తానికి వైద్య పరికరాలు అందిస్తోందన్న విషయం ప్రభుత్వం గ్రహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలు పొలాల్లోనే కుల్లిపోతున్నాయన్నారు. ఐసోలేషన్ వార్డులకు కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం వైకాపా నేతల పిచ్చికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి

లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.