ETV Bharat / city

Womens day wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం..రాజకీయ నాయకుల శుభాకాంక్షలు - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

Womens day wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా.. మహిళలందరికి పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీని శక్తి స్వరూపిణిగా భారతీయులు భావిస్తారని అన్నారు.

political leaders womens day wishes
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
author img

By

Published : Mar 8, 2022, 1:22 PM IST

Womens day wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా.. మహిళలందరికి పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా సాధికారితతోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉంది: చంద్రబాబు

  • తెలుగు మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా అభ్యున్నతి కి తెలుగుదేశం చేసినట్లు మరే పార్టీ కూడా కృషి చెయ్యలేదు. మహిళా సాధికారిత తోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మే పార్టీగా...వారి అభివృద్ధి ని కాంక్షిస్తూ...మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#WomensDay

    — N Chandrababu Naidu (@ncbn) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగు మహిళలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా అభ్యున్నతికి తెలుగుదేశం చేసినట్లు మరే పార్టీ కూడా కృషి చేయలేదని అన్నారు. మహిళా సాధికారితతోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మే పార్టీగా, వారి అభివృద్ధిని కాంక్షిస్తునని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళలకు లోకేశ్ శుభాకాంక్షలు

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు శుభాకాంక్షలు. @ysjagan ఇంట్లో ఆడబిడ్డలకే ర‌క్ష‌ణ లేదు. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్ల‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌? వైసిపి పాలనలో ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించే మ‌హిళా సంక్షేమం వాస్త‌వంలో వుండ‌దు.(1/3)#WomensDay

    — Lokesh Nara (@naralokesh) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇంట్లోనే.. ఆడబిడ్డలకే ర‌క్షణ లేదని.. ఇక రాష్ట్రంలో ఆడపిల్లల‌కి ఇంకెక్కడి ర‌క్షణ‌ అని ట్వీట్‌ చేశారు. వైకాపా పాలనలో ప్రక‌ట‌న‌ల్లో క‌నిపించే మ‌హిళా సంక్షేమం.. వాస్తవంలో ఉండదని ఆక్షేపించారు. మ‌ద్యనిషేధం హామీ ఇచ్చిన జ‌గ‌న్‌రెడ్డి... త‌న సొంత మ‌ద్యంతో మ‌హిళ‌ల పుస్తెలు తెంపేస్తున్నాడని లోకేశ్ విమర్శించారు. ఆడ‌బిడ్డ క‌న్నీరు.. ఆ ఇంటికి, రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం నుంచి అయినా మ‌హిళ‌ల భ‌ద్రత, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప‌ని చేసే బుద్ధి జ‌గ‌న్‌కి ప్రసాదించాల‌న్నారు.

స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు: పవన్ కల్యాణ్

స్త్రీని శక్తి స్వరూపిణిగా భారతీయులు భావిస్తారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. స్త్రీమూర్తుల విజయాలకు హర్షద్వానాలు పలుకుతూ జరుపుకునే మహిళాదినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని స్త్రీ రూపంగా స్తుతిస్తూ వారిని గౌరవించడం మన సనాతన సంప్రదాయంలో ఒక భాగమన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, తనయగా, అవాజ్యమైన ప్రేమానురాగాలు అందించే మహిళామణులను ఎంత కొనియాడినా తక్కువే అని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో వారు సాధించని విజయాలు... అధిరోహించని పదవులూ లేవన్నారు. జనసేన పార్టీ కొనసాగిస్తున్న రాజకీయ యజ్ఞంలో వీర మహిళలు అందిస్తున్న సేవలు, వారి అండదండలు వెలకట్టలేనివని కొనియాడారు. సమాన అవకాశాల సాధనలో మహిళలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Womens Day Special: ఆమె సకల చరాచర సృష్టికీ మూలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.