ETV Bharat / city

బెజవాడ్ గ్యాంగ్ వార్​: ఆ సెటిల్​మెంటే కారణమా?

విజయవాడ నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సందీప్ భార్య.. తన భర్త హత్య వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపించటంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు మొదలుపెట్టారు.

police enquiry on vijayawada gang war
police enquiry on vijayawada gang war
author img

By

Published : Jun 5, 2020, 4:17 AM IST

సందీప్, పండు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ పోలీసు దర్యాప్తులో మరింత కీలకంగా మారింది. 'నాగబాబు అన్న, నేను.... సెటిల్​మెంట్​లో ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావ్.. నాగబాబు అన్న ఉంటే నేనే బయట ఉంటాను. అలాంటిది నువ్వు ఎందుకు వచ్చావ్.' అంటూ సందీప్ .. పండును నిలదీసినట్లు ఫోన్ సంభాషణల్లో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రదీప్ అన్న పిలిస్తే వచ్చాను. అంతేగాని నేనేమీ లీడర్ అవుదామని, డబ్బులు వస్తాయని రాలేదు ... అంటూ పండు ఫోన్ కాల్ రికార్డులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత .. ఒకరిపై ఒకరు అరుచుకోవడం , దుర్భాషలాడుకోవడం..ఆపై సందీప్‌ హత్య జరిగినట్లు పోలీస్‌ విచారణలో స్పష్టమవుతోంది. పెనమలూరు అపార్ట్​మెంట్​కు సంబంధించి జరుగుతున్న సెటిల్ మెంట్‌కు పండు రావటం సందీప్ కు నచ్చలేదు. అదే ఈ వివాదానికి కారణమనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 45 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. గ్యాంగ్ వార్ ఘటన కలకలం సృష్టించడంతో గంజాయ్, బ్లేడ్ బ్యాచ్ ల పై దృష్టి పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. నగరంలో మరోసారి రౌడీయిజం అనే మాట వినపడకుండా చేయాలని అధికారులకు సీపీ ఆదేశించినట్టు తెలిసింది.

ఇదీ చదవండి: బెజవాడ గ్యాంగ్​ వార్​పై లోతైన దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.