కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని సీతరాంపురంలో ఓ అపార్ట్ మెంట్లో నిలిపి ఉంచిన కారులో మద్యం బాటిల్స్ ఉన్నాయన్న సమాచారం మేరకు మచిలీపట్నం పోలీసులు దాడి చేసి 283 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమమద్యం ఉందనే పక్కా సమాచారం మేరకు స్పేషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీల్లో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. హైదరాబాద్ నుంచి మద్యాన్ని రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఎస్పీ వివరించారు. పాలక మండలి సభ్యురాలి భర్త చెక్క ప్రసాద రావు, డ్రైవర్ శివల పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
మద్యంతో మాకు సంబంధం లేదు
కారులో దొరికిన మద్యం సీసాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని దుర్గ గుడి ధర్మకర్త మండలి సభ్యురాలు చెక్క వెంకట నాగ వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. కార్ డ్రైవర్ పెట్రోల్ నింపుకొని వస్తానని కారు తీసుకుని పోయాడని ఆమె చెప్పారు. పోలీసులు వచ్చి తన భర్తను కారు తాళాలు అడిగి డిక్కీ తెరవగా అందులో మద్యం సీసాలు ఉన్నాయన్నారు. మద్యం సీసాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని.. అటువంటి పనులు చేయమని తెలిపారు.
ఇదీ చదవండి:
కెలికి కయ్యం పెట్టుకుంటోంది... ఏపీపై మరోసారి కేసీఆర్ ఆగ్రహం