Turtles illegally moving : కృష్ణాజిల్లా కైకలూరు మండలంలో నిర్వహించిన తనిఖీల్లో.. పోలీసులు భారీ సంఖ్యలో తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో.. రెండు వాహనాల్లో తరలిస్తున్న నాలుగు వందల కిలోల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని భుజబలపట్నం వద్ద రూరల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 25 గోనె సంచుల్లో.. రెండు వాహనాల ద్వారా తాబేళ్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాబేళ్ళను అక్రమందా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు మండల పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : Koppavaram Jathara: విచిత్ర వేషధారణలు..పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం