దేశానికి పింగళి వెంకయ్య చేసిన సేవలకు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించాలని.. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన ముని మనుమరాలు గీతా మాధుర్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో అమృతహస్తం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పేదలకు పండ్ల రసాలు అందజేశారు. కేవలం స్వాతంత్య్ర దినోత్సవం రోజు మాత్రమే కాకుండా.. పింగళి వెంకయ్యను ప్రతిరోజు స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
ఇదీ చూడండి..