ETV Bharat / city

పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు తొలగిన అడ్డంకులు - పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు తొలగిన అడ్డంకులు

రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు అడ్డంకులు తొలగిపోయాయి. విద్యార్థులు తాము సీట్లు పొందిన ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఈనెల 7వ తేదీ నుంచి వెళ్లి చేరవచ్చని ఎన్టీఆర్ వర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తుది గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉందన్నారు.

పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు తొలగిన అడ్డంకులు !

author img

By

Published : Jul 6, 2020, 11:36 PM IST

రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మధ్యవర్తిత్వంతో ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు, పీజీ వైద్య విద్యార్థుల మధ్య ఒప్పందం కుదిరింది. కళాశాలల్లో ఈ నెల 10వ తేదీలోగా చేరాలని గడువు విధించారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ శంకర్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఫీజుల విషయంపై హైకోర్టులో పిటిషన్లు ఉన్నందున తుది తీర్పు మేరకు నిర్ణయించిన రుసుములు చెల్లిస్తామని విద్యార్థులు అంగీకార పత్రాలు ఇస్తే కళాశాలల్లో చేర్చుకుంటామని యాజమాన్య సంఘం నిబంధన పెట్టింది. ఈ నిబంధనకు విశ్వవిద్యాలయం, విద్యార్థులు అంగీకరించడంతో ప్రవేశాల విషయంలో ఏర్పడిన వివాదం ముగిసింది.

విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో హాస్టల్ ఫీజు మినహా.. మిగిలిన ఏడు రకాల రుసుముల విషయంలోనూ ఇరువర్గాలూ అంగీకారానికి వచ్చారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు సీట్లు పొందిన ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఈనెల 7వ తేదీ నుంచి వెళ్లి చేరవచ్చని తెలిపారు. తుది గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో వైద్యుల అవసరం ఎంతో ఉందని.. ఈ నేపథ్యంలో తాము ప్రవేశాలకు అంగీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల యాజమాన్య సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.