రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణా జలాల వివాదానికి చంద్రబాబు నాయుడే(CHANDRA BABU NAIDU) కారణమని మంత్రి పేర్ని నాని(PERNI NANI) ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై దిండి, పాలమూరు-రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేదన్నారు. దీనివల్లే నేడు నీటి ఇబ్బందులు వచ్చాయన్నారు. కృష్ణానదీ జలాల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దుర్మార్గాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా తన వైఖరేంటో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని పేర్ని నాని నిలదీశారు. రాజకీయ నేతగా, రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.
తన హయాంలో రాయలసీమకు నీరిచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎక్కడిచ్చారో చెప్పాలని నాని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే కృష్ణా డెల్టా ఒక్క పంటకే నీరు పరిమితమైందన్నారు. వైకుంఠపురం బ్యారేజీకి చంద్రబాబు హయాంలో ఒక్క రాయైనా వేశారా అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తానని సీఎం జగన్(CM JAGAN) మాట ఇచ్చి తప్పారని చంద్రబాబు ఆరోపిస్తున్నారన్న మంత్రి.. 20 నెలల పాలనలోనే ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో మేనిఫెస్టోలోని మిగిలిన హామీలను కూడా ముఖ్యమంత్రి నెరవేరుస్తారని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలుపరచలేదని ఆక్షేపించారు. వాటికి సమాదానం చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.
ఇదీ చదవండి: