ETV Bharat / city

తెలంగాణ: తెగిన కాగ్నా నది వంతెన.. రోడ్లన్నీ జలమయం - తాండూరు తాజా వార్తలు

తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా నది వంతెన తెగిపోయింది. ఇలా జరగడం.. ఇది ఐదేళ్లలో రెండోసారి. వరదల కారణంగా.. తాండూర్​ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి.

తెగిన కాగ్నా నదీ వంతెన.. రోడ్లన్నీ జలమయం

author img

By

Published : Jul 3, 2020, 8:03 PM IST

తెగిన కాగ్నా నదీ వంతెన.. రోడ్లన్నీ జలమయం

తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికీ తాండూర్​లోని కాగ్నా నది వంతెన తెగిపోయింది. దీనివల్ల మహబూబ్​నగర్​ - తాండూర్​ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్లలో ఇలా వంతెన తెగిపోవడం ఇది రెండోసారి.

2016లో కురిసిన వర్షాలకు కాగ్నా నది వంతెన తెగిపోయింది. ఆ వంతెనకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది. పాత వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పాత వంతెన మీద నుంచే గత ఐదేళ్లుగా రాకపోకలు కొనసాగాయి. మళ్లీ భారీ వర్షాలకు పాత వంతెన మరోసారి కొట్టుకుపోయింది. దీనితో కథ మొదటికి వచ్చింది.

తాండూర్ నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లాయి. హైదరాబాద్​ టూ జహీరాబాద్​, సంగారెడ్డి, మహబూబ్​నగర్​ మార్గాల్లో తాండూర్​కు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.