ETV Bharat / city

నిఘాకోసం ఖర్చు పెడుతున్న నిధులపై ఆడిట్‌ చేయించగలరా ?: పయ్యావుల - పయ్యావుల తాజా వార్తలు

జగన్ సర్కారు ప్రతిపక్షాలతో పాటు అనేక మందిపై ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిఘా పెట్టిందని.. తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. తాను చెప్పేది అవాస్తవమని ప్రభుత్వం చెప్పాలనుకుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఆడిట్‌ చేయించగలరా ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పయ్యావుల
పయ్యావుల
author img

By

Published : Jul 7, 2022, 1:54 PM IST

నిఘాకోసం ఖర్చు పెడుతున్న నిధులపై ఆడిట్‌ చేయించగలరా ?

సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘాను తెదేపా నాయకులపై నిరర్థకంగా కొనసాగిస్తున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎవరెవరిపై నిఘా పెట్టారు, దానికైన ఖర్చుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఆడిట్​కు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించటం కాదని.., రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలని డిమాండ్ చేశారు.

పెగాసెస్ పరికరాలు చంద్రబాబు కొనలేదని స.హ.చట్టం సమాధానం వచ్చినా.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పయ్యావుల మండిపడ్డారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగులను వేధించారన్నారు. పెగాసెస్​పై సభా కమిటీ వేసి చర్చ నిర్వహించటం వృథాప్రాయాసే అయిందని అన్నారు. ఇదంతా వైకాపా ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

డేటాచౌర్యంపై గతంలో కేసు పెట్టి ఏం తేల్చలేకపోయారు. పెగాసెస్‌ కొన్నారో... లేదో తేల్చలేకపోయారు. నిఘా పెట్టలేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఆడిట్‌ చేయించగలరా?.నిఘాలు పెట్టేది మీరు... ఇతరులపై ఆరోపణలు చేస్తారా?. సొంత ఎమ్మెల్యేలు, సాక్షి ఉద్యోగులపైనా నిఘా పెట్టడం వాస్తవం కాదా?. ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారో చెప్పండి. మీరు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు వాడాలంటేనే భయపడుతున్నారు. మీరు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు వాళ్ల పిల్లలకు ఇస్తున్నారు.- పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.