Pawan Tweet: రాష్ట్రంలో పొత్తులాట మొదలైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. జనసైనికులు, ప్రజలనుద్దేశించి పెట్టిన ఆ ట్వీట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారితే.. దాని వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలి. అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి చప్పట్లు, ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటివరకు తిట్టిన వారు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నారని ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే’ అని తెలుసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: