అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గాంధేయవాదాన్ని విశ్వసించి, అహింసామార్గంలో ఆమరణ దీక్షబూని.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవిని అనునిత్యం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాల వల్లే.. స్వాతంత్య్రానికి పూర్వమే హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించారనే విషయాన్ని పవన్ గుర్తు చేశారు. మద్రాసు రాజధానిగా ఉన్న పరిస్థితుల్లో.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు అచంచలమైన దీక్షను నాటి పాలకులు సమర్థించలేకపోయారని పేర్కొన్నారు. అయినా ఆ తెగువ ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. తెలుగువారి అభ్యున్నతి కోసం ఆయన త్యాగాన్ని, నాడు రగిలించిన చైతన్యాన్ని.. మనతో పాటు భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: