ETV Bharat / city

బాపూజీ స్పూర్తితో నేడు శ్రమదానం: పవన్ కల్యాణ్ - pavankalyan on gandhi jayanthi

అన్యాయం, హింస, దురాక్రమణ వంటి వాటిపై పోరాడే తత్వాన్ని భరత జాతికి జాతిపిత మహాత్మా గాంధీ అందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. విశృంఖలత్వంతో సాగిన దుష్టపాలనను అంతమొందించిన స్ఫూర్తి తనతోపాటు జన సైనికులకు సదా శిరోధార్యమని ఆయన వెల్లడించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
author img

By

Published : Oct 2, 2021, 4:30 AM IST

అన్యాయం, హింస, దురాక్రమణ వంటి వాటిపై పోరాడే తత్వాన్ని భరత జాతికి జాతిపిత మహాత్మా గాంధీ అందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. విశృంఖలత్వంతో సాగిన దుష్టపాలనను అంతమొందించిన స్ఫూర్తి తనతోపాటు జన సైనికులకు సదా శిరోధార్యమని ఆయన వెల్లడించారు. మహాత్ముడి 152వ జయంతి సందర్భంగా జాతిపిత స్ఫూర్తితో రాష్ట్రమంతటా రోడ్లకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేయాలని సంకల్పించిన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహాత్ముడు జన్మించిన అక్టోబర్ 2వ తేదీ నాడే పుట్టిన దివంగత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో విశిష్టమైన కృషి జరిపారని కొనియడారు.

ఇదీ చదవండి:
'మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.