ETV Bharat / city

కొత్త జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టాలి: పవన్ - అల్లూరి సీతారామరాజు జయంతి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని తెలుగునేల ఎప్పటికీ మరవదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ అన్నారు. అల్లూరి త్యాగనిరతి, సాహసం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు.. ఒకదానికి మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టాలని పవన్‌ కోరారు.

pavan kalyan comments on alluri
అల్లూరి జయంతి
author img

By

Published : Jul 4, 2020, 6:27 PM IST

Updated : Jul 4, 2020, 6:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో ఒకదానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా జనసేన తరఫున అంజలి ఘటించారు. పీడిత వర్గాల్లో చైతన్యం రగిలించి... బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరు సాగించిన అల్లూరిని తెలుగు నేల ఎన్నటికీ మరువదన్నారు. సాయుధ పోరాటం ద్వారా నాటి బ్రిటిష్ పాలకులపై పోరు సాగించిన ఆయన సాహసం చిరస్మరణీయమని అభివర్ణించారు.

pavan-kalyan-comments-on-alluri
జనసేన విడుదల చేసిన ప్రకటన

భావితరాలకు అల్లూరి సీతారామరాజు ఒక స్ఫూర్తిశీలి అని... ఆయన త్యాగనిరతి, సాహసం యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని ఒక సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

తితిదే అధికారుల నిర్లక్ష్యం... శ్రీవారి ఆలయ గోపురాలపై మెుక్కలు

Last Updated : Jul 4, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.