పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోందని.. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది(gk dwewedi) తెలిపారు పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయని, మిగిలిన నాలుగు చోట్ల తడిచాయని తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమనుకుంటే.. దానిపై ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
అధికారులదే నిర్ణయం
బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై.. స్థానికంగా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం, రాత్రి వరకు వస్తుంటాయన్నారు.
దెబ్బతిన్న బ్యాలెట్ పేపర్లు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, బీజత్ పురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నగా.. శ్రీకాకుళం జిల్లా సొరబుచ్చి మండలం షలాంత్రి, విశాఖపట్నంలోని ముక్కవారిపాలెం మండలం తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని ద్వివేది వివరించారు.
ఇదీ చదవండి: Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం