ETV Bharat / city

మంత్రి గౌతంరెడ్డికి.. భాజపా, కాంగ్రెస్​, సీపీఎం నేతల నివాళి - Mekapati Gautam Reddy death

Condolences to Mekapati Gautam Reddy: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల.. భాజపా, కాంగ్రెస్, సీపీఎం నేతలు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Opposition party leaders Condolences to minister Mekapati Gautam Reddy
మంత్రి గౌతంరెడ్డికి భాజపా, కాంగ్రెస్​, సీపీఎం నేతల నివాళి
author img

By

Published : Feb 21, 2022, 4:59 PM IST

Condolences to Mekapati Gautam Reddy: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

సోమువీర్రాజు దిగ్భ్రాంతి..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మంత్రి ఎంతో కృషి చేశారని అన్నారు. శాసనమండలికి హాజరైన సందర్భంలో గౌతంరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన రాజకీయ నేతను కోల్పోయిందన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా ఉండేవారు: శైలజనాథ్
సౌమ్యుడు, మృదు స్వభావిగా ఉండే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించడం బాధాకరమని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారన్నారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.

సీపీఎం సానుభూతి
మంత్రి గౌతంరెడ్డి మృతి పట్ల.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు.. సీపీఎం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి:

గౌతమ్ రెడ్డి సమర్థంగా పని చేశారు.. ఆయన ఆకస్మిక మరణం బాధాకరం - చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.