కరోనా సమయంలో ఎనలేని కృషి చేసిన రాష్ట్ర పోలీసుల కుటుంబ సభ్యుల కోసం ఓ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆన్‌లైన్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని చేపట్టారు. 2020 ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉచితంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 373 మంది నమోదు చేసుకోగా.. 300 మంది హాజరయ్యారు. 45 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ శిక్షణ ద్వారా.. మన సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత వంటి విషయాలలో అవగాహన కలుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: