ETV Bharat / city

బల్క్ బుకింగ్​లో బొక్కేశారు

ఇసుకను అందినకాడికి దోచుకుంటున్నారు... పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నామని ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమంటూ ఆన్‌లైన్‌లో బల్క్‌ బుకింగ్‌ చేసుకుంటూ... ఆ తర్వాత వేరొక చోటికి మళ్లిస్తున్నారు... ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో బల్క్‌ బుకింగ్‌లో కొందరు గుత్తేదారులు చేసిన మతలబు ఇది.

online fraud in sand bulk booking
online fraud in sand bulk booking
author img

By

Published : Jun 3, 2020, 5:56 AM IST

బల్క్ బుకింగ్​లో 55 శాతానికిపైగా ఇసుక ఇలాగే దారి మళ్లినట్లు గుర్తించారు. ఇసుక అవసరమైన సామాన్యులకు సాధారణ ఆన్‌లైన్‌ బుకింగ్‌, వివిధ నిర్మాణాలు చేసే గుత్తేదారులకు బల్క్‌ బుకింగ్‌ను... ఏపీఎండీసీ అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులకు ఏపీఎండీసీయే లారీల్లో ఇసుకను ఇళ్ల దగ్గరకే తీసుకెళ్లి అందిస్తోంది. తమ దగ్గర లారీలు ఉంటే నిల్వ కేంద్రం నుంచి ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటును గుత్తేదారులకు కల్పించారు. ఇదే అదనుగా కొందరు దారి మళ్లించారు. నిల్వ కేంద్రం నుంచి ఇసుక లారీలు బయలుదేరి, గుత్తేదారులు పేర్కొన్న చోట్లకు కాకుండా, ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 22 లక్షల టన్నుల మేర బల్క్‌ బుకింగ్‌లకు ఇసుక సరఫరా చేయగా, అందులో 55 శాతానికిపైగా (దాదాపు 13 లక్షల టన్నులని అంచనా) దారి మళ్లినట్లు తేలింది. లారీలకు ఉన్న జీపీఎస్‌, ఇతర సమాచారాలతో ఈ వివరాలు సేకరించారు. అప్రమత్తమైన అధికారులు బల్క్‌ బుకింగ్‌ను ఆపేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన వారికే బల్క్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక సరఫరా చేయాలని భావిస్తున్నారు.

  • ప్రతి ట్రిప్పులో రెండు, మూడు టన్నులు

తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇసుకను లారీల్లో విశాఖపట్నం జిల్లాకు తీసుకెళ్లి ఐదారు చోట్ల నిల్వ చేస్తున్నారు. ఇసుక లోడుతో లారీలు వెళ్లే సమయంలో, దారి మధ్యలో ఆపి రెండు, మూడు టన్నులు దించేసేవారు. ఈ విషయాన్ని అధికారులు ఆరా తీసి గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు లారీ ఇసుక లోడుతో బయలుదేరే ముందు రీచ్‌లోనే టార్పాలిన్‌ షీట్‌తో మూసివేసి, నాలుగు వైపులా సీల్‌ వేయనున్నారు. ఆ సీల్‌ను నిల్వ కేంద్రంలోనే తెరవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.