ETV Bharat / city

One time settlement scheme: అందుకే వన్​ టైమ్​ సెటిల్మెంట్​ పథకాన్ని ప్రకటించారు.. - గృహ హక్కు పత్రాలు

One time settlement scheme: రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన గృహ హక్కు పత్రాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్​ జైన్​ తెలిపారు.

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్​ జైన్

author img

By

Published : Dec 1, 2021, 8:59 PM IST

One time settlement scheme: రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన గృహ హక్కు పత్రాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్​ జైన్​ తెలిపారు. హౌసింగ్​ కార్పొరేషన్​ వద్ద 4 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. అసలు మొత్తం తక్కువగా ఉన్నా వడ్డీ బాగా పెరిగిందన్నారు. అందుకే వన్​ టైమ్​ సెటిల్మెంట్​ పథకాన్ని సీఎం ప్రకటించారని స్పష్టం చేశారు.

రుణం ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం 10 వేలు తీసుకుని హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే గ్రామీణ, పట్టణ ప్రాంతల్లోని వారికి రిజిస్ట్రేషన్​ టైటిల్​ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. తద్వారా వారు గృహాలకు సొంతదారులు అవుతారని తెలిపారు. రుణాలు, విక్రయం చేసేందుకు వీలుకలుగుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రిజిస్ట్రేషన్​, యూజర్​ చార్జీలు కూడా మాఫీ చేసిందని జైన్ తెలిపారు. అంతా సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల చుట్టూ తిరక్కుండా గ్రామ సచివాలయాలల్లోనే రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వెల్లడించారు. 22 ఏ జాబితా నుంచి కూడా వారి స్థలాలను తొలగిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇవన్నీ లబ్ది దారులకు ప్రయోజనం కలిగించేవేనని.. అయితే ఇది స్వచ్ఛంద పథకం మాత్రమేనన్నారు. డిసెంబర్​ 8 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఆశిస్తున్నామన్నారు. ఎక్కడా సిబ్బందికి లక్ష్యాలను విధించలేదని తెలిపారు. ప్రజల వద్దకు ఈ పథకాన్ని తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మిగతా సంక్షేమ పథకాల అమలుపై దీని ప్రభావం పడదని అన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ వద్ద రుణం తీసుకున్న వారికి మాత్రమే ఈ లబ్ది కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ దాదాపు 10 వేల కోట్ల మేర బకాయిలు రద్దు చేస్తోందని తెలిపారు. 10 వేల రూపాయలన్నది విధాన పరమైన నిర్ణయమని.. ఆ మొత్తం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: minister botsa on OTS: ఈ నెల 20 నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.