TDR bonds: పుర, నగరపాలక సంస్థలు జారీ చేసిన బదిలీకి వీలున్న హక్కు పత్రాలు (టీడీఆర్ బాండ్లు) కొనుగోలు చేసిన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామీణ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరిలోని తణుకు పురపాలక సంఘంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినందున, ఇప్పటికీ వినియోగించుకోని బాండ్లను నిలుపుదల చేశామని అన్నారు. కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టాలన్నది ఉద్దేశంకాదని, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి తాత్కాలికంగా నిలుపుదల చేశామని అధికారులు వివరించారు.
‘ఈనాడు’ పత్రికలో ‘టీడీఆర్ బాండ్ల వినియోగం నిలిపివేత’ శీర్షికతో వెలువడిన కథనంపై అధికారులు వివరణ ఇచ్చారు. కొనుగోలుదారులకు ఎలాంటి నష్టం కలిగించమని, టీడీఆర్ బాండ్ల క్రయ, విక్రయాలు నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. కాగా టీడీఆర్ బాండ్ల వినియోగాన్ని నిలిపివేయడంపై కొనుగోలుదారులు పలువురు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు.
ఇదీ చదవండి:
ఉద్యోగుల నియామకంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఉద్యోగులు