NTR University Convocation: గురువారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ స్నాతకోత్సవం జరగనుందని వర్సిటీ ఉపకులపతి డా. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 22, 23వ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిశ్చందన్ వర్చువల్‌గా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సర్జన్ డా. పళణివేలు, డా. నాగేశ్వరరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వీసీ వెల్లడించారు.
పలువురికి గౌరవ డాక్టరేట్లు..
దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు నిర్వహించి.. వైద్య రంగానికి ఎనలేని సేవలు చేసిన డాక్టర్ సి. పళణివేలు, వర్డల్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ డి. నాగేశ్వరెడ్డిలకు ఎన్టీఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. అలాగే మెరిట్ సాధించిన మెడికోలకు(విద్యార్థులకు) మెడల్స్, క్యాష్ ప్రైజులు ఇవ్వనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ నిబంధనల మేరకు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి..
యథావిధిగా 'సివిల్స్ మెయిన్స్'... అభ్యర్థులకు యూపీఎస్సీ కీలక సూచనలు