విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగులు (NTR University Employees Protest over fund transfers news) ఆందోళనకు దిగారు. రూ.400 కోట్లను వీసీ ఏకపక్షంగా బదిలీ చేశారని వారు ఆరోపించారు. జీవో నెంబరు 25తో బ్యాంకుల్లోని డిపాజిట్లకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
ఈ మేరకు వీసీ ఛాంబర్లో బైఠాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కష్టపడి వర్సిటీకి రూ.448 కోట్ల నిధులను కూడబెట్టామని.., వాటిని ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లోకి బదిలీ కోరటం సరికాదన్నారు. ఐకాసగా ఏర్పడి రేపట్నుంచి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
ఇదీ చదవండి
CM JAGAN REVIEW ON FLOODS: 'పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలి'