ETV Bharat / city

ఆగని అక్రమ రవాణా... రూ.2 కోట్ల మద్యం స్వాధీనం - liquor smuggling in ap

పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. మద్యం రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినా... అక్రమార్కులు కొత్తదారులు వెతుక్కుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు విలువ చేసే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Rs 2 crore liquor seized
మద్యం స్వాధీనం
author img

By

Published : Jul 25, 2020, 12:21 AM IST

విజయవాడ కమిషనరేట్ పరిధిలో అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై ఎస్​ఈబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్​ఈబీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ బి.శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటి వరకు 786 కేసులు నమోదు చేసి రెండు కోట్ల రూపాయల విలువ గల 48,404 మద్యం సీసాలు, 652 ద్విచక్ర వాహనాలు, 32 ఆటోలు, 88 కార్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. 79 మందిని అరెస్ట్ చేసి 62 కేసులు నమోదు చేశారు. 10,407 మద్యం సీసాలు, 49 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండీ... కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.