హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. విచారణకు గైర్హాజరవడంతో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నబాబు, అంబటిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలోనూ న్యాయస్థానం వీరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ..కేసు విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
'జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'.. పవన్‌కు కొడాలి సవాల్ !