ETV Bharat / city

వెయ్యికి పైగా పాఠశాలల్లో ఒక్క టీచరూ లేరు! - పాఠశాలల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ సిబ్బంది బదిలీల తర్వాత రాష్ట్రంలోని వెయ్యికి పైగా పాఠశాల్లలో ఒక్క టీచరూ లేకుండా పోయారు. మరికొన్ని పాఠాశాలలు ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి. బదిలీల్లో పోస్టులను బ్లాక్‌ చేయడం.. బోధన సిబ్బంది కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తెంది.

వెయ్యికి పైగా పాఠశాలల్లో ఒక్క టీచరూ లేరు

author img

By

Published : Feb 28, 2021, 8:09 AM IST

బదిలీల్లో పోస్టులను బ్లాక్‌ చేయడం.. బోధన సిబ్బంది కొరత కారణంగా కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులే లేకపోగా.. మరికొన్ని ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి. ప్రతి పాఠశాలకూ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా ఇటీవల నిర్వహించిన హేతుబద్దీకరణ గాడితప్పింది. కొన్ని బడుల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో పక్కనున్న వారిని డిప్యుటేషన్‌పై సర్దుబాటు చేస్తుండగా.. ఏకోపాధ్యాయులు సెలవులు పెడితే సమీపంలోని వారిని తాత్కాలికంగా పంపిస్తున్నారు. దీంతో బోధన కుంటుపడుతోంది. ‘నాడు-నేడు’ కింద పాఠశాలలను బాగు చేస్తున్నా బోధన సరిగా ఉండకపోతే విద్యార్థులకు ఏం మేలు జరుగుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలకు ముందు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని బడులు రాష్ట్ర వ్యాప్తంగా 1,286 ఉండగా.. హేతుబద్దీకరణ తర్వాత ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న వారు కొందరు బదిలీపై వెళ్లిపోగా.. కొన్నింటిలో ఖాళీలున్నా ఎవ్వరూ ఎంపిక చేసుకోకపోవడంతో ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో సమీపంలోని వారిని వారం, పది రోజులకు డిప్యుటేషన్‌పై పంపిస్తుండగా..మరికొన్ని చోట్ల తాత్కాలిక సర్దుబాటు చేశారు. డిప్యుటేషన్‌పై వచ్చే వారు మారుతుండటంతో విద్యార్థుల్లోనూ గజిబిజి ఏర్పడుతోంది.

  • కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని నిట్రవట్టి ప్రాథమిక పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. బదిలీలకు ముందు వరకు ఇక్కడ ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో అందరూ వెళ్లిపోవడంతో గుళ్లెం, బిల్లెహాల్‌ నుంచి ఇద్దర్ని డిప్యుటేషన్‌పై వేశారు.
  • ప్రకాశం జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ బదిలీ అయ్యారు. ఈ స్థానాల్లోకి ఎవ్వరూ రాకపోవడంతో బదిలీ అయిన వారిని తాత్కాలిక పద్ధతిపై ఇక్కడే కొనసాగిస్తున్నారు.
  • చిత్తూరు జిల్లాలో 134 బడులకు ఒక్క ఉపాధ్యాయుడూ లేరు. ఇక్కడికి డిప్యుటేషన్‌పై సమీపంలోని వారిని పంపిస్తున్నారు. నెల్లూరులో 69 పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి.
  • గుంటూరు జిల్లాలో 13పాఠశాలల్లో ఒక్కరూ లేకపోవడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన వారినే వేతనాలు కొత్తబడిలో తీసుకొని, పాత పాఠశాలలో పని చేసేలా సర్దుబాటు చేశారు.
  • కృష్ణాలో 29, విశాఖపట్నం జిల్లాలో 75బడులు తాత్కాలిక సర్దుబాటుతోనే కొనసాగుతున్నాయి.

ఒకే ఒక్కరు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో 1-5 తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు ఉన్న బడులు 8 వేల వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి. ఇక్కడ పని చేసేవారు సెలవు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందిస్తే తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నారు. లేదంటే మూతపడుతున్నాయి. ఐదు తరగతుల వారిని ఒకే గదిలో ఉంచి చదువు చెబుతున్నారు. దీంతో విద్యార్థులందరిపైనా దృష్టి పెట్టలేని పరిస్థితి. ఉపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోధించాల్సి వస్తోంది.

కొన్నిచోట్ల మూతే..

నెల్లూరు జిల్లాలో 918 ఏకోపాధ్యాయ బడులు ఉండగా.. ఇక్కడ కొన్నిచోట్ల ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడి మూతపడుతోంది. మినగల్లులోని ప్రాథమిక పాఠశాలలో 31 మంది విద్యార్థులకు ఒకే ఒక్కరు ఉన్నారు. ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఈ పాఠశాలకు డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఇతరులు ముందుకు రావడంలేదు. సెలవు పెడుతున్న విషయాన్ని కొందరు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్న దాఖలాలు ఉండడం లేదు.

కర్నూలు జిల్లాలో 98 బడులు ఏకోపాధ్యాయులతో కొనసాగుతుండగా.. చిత్తూరులో ఈ సంఖ్య 99గా ఉంది. గుంటూరులో 20 ఆంగ్ల మాధ్యమ బడుల్లోనూ ఒక్కరే ఉండగా.. పశ్చిమగోదావరిలో 595, తూర్పుగోదావరిలో 250, విశాఖలో 115, శ్రీకాకుళంలో నాలుగు పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒక్కరే బోధన సాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఈశాన్యం నుంచి వేడిగాలులు..రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.