వైకాపా నేతలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. 5 వేల కోట్ల జేట్యాక్స్ కోసం మద్యం దుకాణాలు నడుపుతున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల ద్వారా మగవారికి, రేషన్ షాపుల ద్వారా ఆడవారికి ప్రభుత్వం కరోనా వ్యాపింపచేస్తోందని రామానాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరు ప్రకటనల్లో తప్ప, ఆచరణలో శూన్యమని నిమ్మల ఆరోపించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైనందున వైరస్ వల్ల మృతి చెందిన కుటుంబాలకు 10లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 34 కోట్ల రూపాయల వరకు అంబులెన్సుల నిర్వహణ పేరుతో దోచేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి
కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 6న నోటిఫికేషన్.. 24న పోలింగ్