newborn-baby-dies: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి మాతా శిశు సంక్షేమ విభాగంలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పసిబిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పసిబిడ్డ తో బాధితులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. తమ నిర్లక్ష్యం లేదంటూ డాక్టర్లు బదులిస్తున్నారు. పసిబిడ్డను చూసి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నందిగామ నుంచి ప్రసవం కోసం గర్భిణీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.
ఇదీ చదవండి: Bus accident: ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి