ETV Bharat / city

ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..! - new year

నేను(2019)... నీకు(2020)కి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నాలోనే చాల సమస్యలు వచ్చాయి. నువ్ వీలైనంత జాగ్రత్తగా ఉండు. మంచి చేసేందుకే ప్రయత్నించు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టకు. అబ్బా 2020వ సంవత్సరం అనుకులే చేయి. ఛీ 2020 ఆ.. అనుకునేలా అస్సలు చేయకు.

new year story
new year story
author img

By

Published : Dec 31, 2019, 1:59 PM IST

అప్పగింతలు.. ఓన్లీ..పెళ్లిళ్లలోనేనా.. ఎవరైనా.. ఎవరికైనా ఇవ్వొచ్చు. అదే అంటోంది 2019. కొన్ని విషయాలను 2020కి గుర్తుచేస్తుంది. జాగ్రత్తా! అంటూ హెచ్చరిస్తోంది. ప్రజలను ఎలాంటి.. ఇబ్బందులు పెట్టొదని చెబుతుంది.

2020: ఇంతకీ నీ 2019లో ఏం జరిగింది.
2019: నాలోనే మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది తెలుసా.
2020: మూడు రాజధానులా?
2019: అవును! రాజధాని రైతులు ఒకటే నిరసనలు, ఆందోళనలు. ఈ వ్యవహరంపై కాస్త జాగ్రత్తగా ఉండు. వీలైతే నీలోనే ఈ సమస్య పరిష్కారమయ్యేలే చేయి.
2020: ఏమో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?
2020: ఎన్​ఆర్​సీ అని కూడా విన్నాను.
2019: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్​ఆర్​సీ నిర్ణయంపై రచ్చ జరిగింది.
2020: మరి ప్రభుత్వం ఏమంది?
2019: తర్వాత వెనక్కు తగ్గినట్టే అనిపించింది. నీలో ఇలాంటి సమస్యలు లేకుండా.. ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు.
2020: అవునా.. ఇంకా!
2019: నాలోనే సార్వత్రిక సమరం జరిగింది. మరీ ఎక్కువ కాదు గానీ.. కొన్ని సమస్యలైతే వచ్చాయి. నన్ను తిట్టుకున్న వారూ ఉన్నారు. నాకు తెలిసి పంచాయతీ పోల్​ నీలోనే జరుగుతుందేమో.
2020: అవునా?
2019: పంచాయతీ ఎన్నికలు నాలోనే జరగాల్సింది. అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. సార్వత్రిక సమరంలో మద్యం ఏరులై పారింది. పంచాయతీ పోల్​లో జోరెక్కువా. నువ్ ఎంత జాగ్రత్త పడితే అంత మంచింది.
2020: వామ్మో.. తాగితే.. లేనిపోని గొడవలు.. మద్యం బాబుల గడ్డం పట్టుకోనైనా.. వద్దంటా.
2019: నాలో చాలా క్రైమ్​ జరిగింది. దేశాన్ని మెుత్తం ఒకే మాటపైకి తెచ్చిన 'దిశ' ఘటన జరగడం బాధకరం.
2020: దిశ ఘటనా.. ఏమైంది అసలు?
2019: పాపం ఓ అమ్మాయిని దుర్మర్గులు దారుణంగా హత్యచారం చేశారు. చివరకు సీన్​ రికన్​స్ట్రక్షన్​లో ఎన్​కౌంటర్ అయ్యారు.
2020: అంత దారుణాలు జరుగుతాయా?
2019: అంతకంటే దారుణాలు జరుగుతాయి. బయటకురాకుండా కాలగర్భంలో కలిసిన నేరాలెన్నో ఉన్నాయి. చూసుకో నీ 2020లో క్రైమ్​ ఎక్కువ జరగకుండా.. జాగ్రత్తపడు.
2020: ఇంకా ఏమేమేం జరిగాయో..నీలో?
2019: పాపం అనావృష్టితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల పంట నష్టం.
2020: ప్రాజెక్టులు నిండాయా మరి?
2019: ప్రాజెక్టులు నిండిపోయేలా.. వర్షాలు పడ్డాయి. అతివృష్టి ఎక్కువై.. నాలోనే ఉల్లి లొల్లి జరిగింది.
2020: వర్షాలు ఎక్కువ కురిసినా సమస్యే కదా!
2019: అవునూ నీ హయంలో ప్రాజెక్టులు నిండేలా చూడు. కానీ అతివృష్టి రానివ్వకు. అన్నదాతలు ఆవేదన చెందేలా అస్సలు చేయకు. జాగ్రత్త!
2020: సినిమా ప్రపంచం గురించి సంగతేంటీ?
2019: చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని మాత్రమే.. హిట్​. కొన్నింటిలో కొన్ని మాత్రమే సూపర్ హిట్. విజయలేమంతా చెప్పుకునేలా లేవులే. నువ్వైనా.. టాలివుడ్​కు విజయాలనెక్కువ ఇవ్వు.
2020: ఈసారి దర్శకులు మంచి కథలు ఎంచుకునేలా చేస్తా.
2019: అవునూ.. నిన్ను నువ్​ గమించావా?
2020: ఎందుకు ఏమైంది?
2019: 01-01-20 అని ఏదైనా డాక్యుమెంట్స్​పై రాసినా సమస్యే.. తెలివైన వారేవరైనా.. సంవత్సరం పక్కనే రెండు అంకెలు కలిపి.. గతంలోకి తీసుకెళ్లొచ్చు. ఎక్కువ తెలివైన వాళ్లైతే.. భవిష్యత్​లోకి తీసుకెళ్లగలరు సుమీ! వీలైతే.. మెుత్తం 01-01-2020 అని రాసేలా.. జనాలకు గుర్తుచేయి.
2020: అవునవునూ..మర్చిపోయా. ఏదైనా జరిగితే.. నన్నే తిట్టుకుంటారు. గుర్తుపెట్టుకుంటా.

నీలో దు:ఖాలు..సంతోషాలు.. బాధలు.. బాధ్యతలు.. ఆప్యాయతలు.. అన్యాయాలు.. ఆవేదనలు.. ఇలా అన్ని ఉంటాయి. మనిషికి కావాల్సినవి ఇవ్వు. వాళ్లు వద్దనుకున్నవి.. నీలోనే కలిపేసుకో.. వాళ్లు సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి.

ఇదీ చదవండి: ప్రోమో: సాంగ్ ఆఫ్ ద ఇయర్ 'సామజవరగమన'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.