ETV Bharat / city

జూలై 1న నూతన 104, 108 వాహన సేవలు ప్రారంభం - ఏపీలో నూతన 104 108 వాహన సేవల వార్తలు

జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా నూతన 104, 108 వాహనాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్​లో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్షించారు.

new 104 108 vehicle services starts in ap state from july
జూలై 1న నూతన 104, 108 వాహనాల సేవలు ప్రారంభం
author img

By

Published : Jun 25, 2020, 6:56 PM IST

జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన 104, 108 వాహనాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ కూడలిలో ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఈ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు పరిశీలించారు. బెంజ్ సర్కిల్ పెట్రోల్ బంకు వద్ద వేదిక ఏర్పాట్లు, సర్వీసు రోడ్డుపై వాహనాల అమరిక, ట్రాఫిక్ నియంత్రణ, ఆయా జిల్లాలకు కేటాయించిన వాహనాల తరలింపు, సంబంధిత డ్రైవర్​ల హాజరు తదితర అంశాలపై వారు సమీక్షించి సూచనలు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలైన కార్డియో వ్యాస్కులర్, ఆక్సిజన్ కంట్రోల్ చేసే పల్స్ టైల్ మీటర్ వంటివి ఈ వాహనాల్లో ఉంటాయని మంత్రి తెలిపారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు, గర్భిణులకు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్​డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో వీటిని రూపొందించారని వివరించారు.

ఇవీ చదవండి... : వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.