ETV Bharat / city

ఈ లింక్​పై క్లిక్ చేయండి.. మన సీతాకోక చిలుకను గెలిపించండి - జాతీయ బటర్ ఫ్లై పోటీల ఎంపిక తాజా వార్తలు

మన దేశ జాతీయ జంతువు పులి. జాతీయ చెట్టు మర్రి. జాతీయ పక్షి నెమలి. మరీ జాతీయ సీతాకోక చిలుక ఏది? సమాధానం కోసం ఆలోచించకండి... ఇప్పటివరకు జాతీయ సీతాకోక చిలుక లేదు. అయితే జాతీయ సీతాకోక చిలుకను ఎంపిక చేసుకునే అవకాశం మనకు వచ్చింది. మొట్టమొదటిసారిగా తనకు నచ్చిన సీతాకోకచిలుకల ఎంపికకు పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో భాగంగా అక్టోబరు 8 వరకు ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ చేసేందుకు ప్రకృతి ప్రేమికులందరికీ అవకాశం ఉంది.

జాతీయ సీతాకోక చిలుకగా ఏదీ ఎన్నికవుతుందంటారు?

author img

By

Published : Sep 29, 2020, 6:37 PM IST

Updated : Sep 29, 2020, 8:05 PM IST

సీతాకోకచిలుకలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. మనదేశంలో 1400 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ సీతాకోక చిలుకను ఎంపిక చేయాలని ప్రకృతి ప్రేమికుల నుంచి ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ జాతీయ సీతాకోక చిలుకను ఎంపిక చేసేందుకు ఓటింగ్‌ నిర్వహిస్తోంది. 1400 సీతాకోక చిలుకల్లో ఏ రకాన్ని ప్రకటించాలనే విషయంపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది.

సీతాకోకచిలుకల ప్రేమికులంతా కలిసి నేషనల్‌ బటర్‌ఫ్లై క్యాంపెయిన్‌ కన్సార్షియం అనే సంస్థగా ఏర్పడి... ఈ సర్వే చేపడుతున్నారు. 1400 రకాల్లో ఇప్పటికే ఏడు రకాలను ఎంపిక చేశారు. వాటిలో ఏదో ఒక దానిని జాతీయ సీతాకోక చిలుకగా గుర్తించనున్నారు.

ఇప్పటివరకు ఎంపిక చేసిన ఏడు రకాల సీతాకోక చిలుకల్లో ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని మూలపాడు, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఉండే మూడు రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. కామన్‌ జెజిబెల్‌, ఆరెంజ్‌ ఓక్‌లీఫ్‌, ఇండియన్‌ నవాబ్‌ అనే పేర్లు కలిగిన సీతాకోకచిలుకలు ప్రస్తుతం జాతీయ పోటీలో నిలిచాయి. కృష్ణా జిల్లా మూలపాడులో ఇప్పటికే ఈ సీతాకోక చిలుకల పార్కు కోసం రెండేళ్ల క్రితం ఏర్పాట్లు చేశారు. ఏటా వర్షాకాలంలో మూలపాడు అటవీ ప్రాంతంలో 60 రకాల బటర్‌ఫ్లైలు వస్తుంటాయి.

మన వాటి కోసం మనం కదలాలి..

జాతీయ సీతాకోక చిలుకగా మన రాష్ట్రానికి చెందిన దానిని ఎంపిక చేయాలంటే మనమంతా ఓటేయాలి. విజయవాడ అడ్వంచర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. సీతాకోక చిలుకలకు ఓ గుర్తింపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఓటింగ్‌ సర్వే జరుగుతోంది. అందుకే.. ఈ ఓటింగ్‌లో అందరూ పాల్గొనాలనేది నా భావన.

- రాజేశ్‌ వర్మ, విజయవాడ అడ్వంచర్స్‌ క్లబ్‌ సభ్యులు

దేశవ్యాప్తంగా ఉండే సీతాకోకచిలుకల్లో తొలుత 50 రకాలను ఎంపిక చేశారు. వాటిలో చాలా అందంగా ఉండేవి, ప్రకృతికి హాని చేయనివి... చూడగానే గుర్తు పట్టగలిగేవి... మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిగా ఉండేవి... ఇలా పది పాయింట్ల ఆధారంగా 50లో ఏడింటిని ఎంపిక చేశారు. నేషనల్‌ బటర్‌ఫ్లై పోల్‌ పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఓటింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 8వరకు జరుగుతుంది. వీటిలో ఎక్కువ మంది ఓటేసిన దానిని ఎంపిక చేసి కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు నివేదిక అందజేస్తారు. 2021 మార్చిలోపు జాతీయ సీతాకోకచిలుక ప్రకటన ఉంటుంది.

అంతర్జాతీయ స్థాయిలో సీతాకోక చిలుకలకు సంబంధించిన సంస్థలు చాలానే ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రకృతి ప్రేమికులు సీతాకోకచిలుకల మనుగడను కాపాడేందుకు యత్నిస్తున్నారు. మన రాష్ట్రంలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తే.. ఎన్నో అరుదైన సీతాకోకచిలుకలు కనువిందు చేసే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

ఈ లింక్‌ ద్వారా గూగుల్‌ లోనికి వెళ్లి ఓట్లు వేయొచ్ఛు: http:///tiny.cc/nationalbutterflypoll

Last Updated : Sep 29, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.