కరోనా టీకా ఇచ్చే వయస్సు పరిమితిని 30ఏళ్లకు కుదించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. కరోనా రెండో దశ నియంత్రణకు ప్రభుత్వపరంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. బహిరంగ ప్రదేశాల్లో ముగ్గురికి మించి ఉండకుండా నియంత్రించటంతో పాటు చిరు వ్యాపారులకు నష్టం కలుగుకుండా తగు ప్రత్యామ్నాయాలు కల్పించాలన్నారు. మాస్క్ ధరించేలా అవగాహన కల్పించేందుకు, మాస్క్ పెట్టుకోని వారిని చైతన్యపరిచేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించాలన్నారు. రక్తనిధి కేంద్రాల్లో తగినంత రక్తం నిలువ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని హితవు పలికారు.
-
కరోనా రెండో దశ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి లేఖ రాసాను. ముగ్గురుకు మించి వినియోగదారులు ఎక్కడా గుమ్మికూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.(1/3) pic.twitter.com/5PXiCMTy79
— Lokesh Nara (@naralokesh) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనా రెండో దశ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి లేఖ రాసాను. ముగ్గురుకు మించి వినియోగదారులు ఎక్కడా గుమ్మికూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.(1/3) pic.twitter.com/5PXiCMTy79
— Lokesh Nara (@naralokesh) April 19, 2021కరోనా రెండో దశ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి లేఖ రాసాను. ముగ్గురుకు మించి వినియోగదారులు ఎక్కడా గుమ్మికూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.(1/3) pic.twitter.com/5PXiCMTy79
— Lokesh Nara (@naralokesh) April 19, 2021
ఇదీ చదవండి