రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దుయ్యబట్టారు. కరోనా కంటే ప్రమాదకరమైన జగరోనా వైరస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నించిందని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణమయ్యారని ఆరోపించారు. ఐపీఎస్‌లను కోర్టు ముందు నిలబెట్టారని ఆక్షేపించారు. నియంత ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెదేపా పోరాటం చేస్తూనే ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: