తమపైన, తమ కార్యాలయాలపైన దాడిచేసిన వాళ్లల్లో ఒక్కరినైనా డీజీపీ అరెస్ట్ చేశారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(naralokesh) నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపే తెదేపా నేతల్ని అరెస్ట్ చేస్తారా అంటూ దుయ్యబట్టారు. తమ నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూపోతే తెలుగుదేశం పార్టీలో 70 లక్షల మందిని అరెస్ట్ చేయాలన్నారు.
-
డిజిపి గారూ! మాపైనా, మా కార్యాలయాలపైనా దాడిచేసినోళ్లలో ఒక్కడినైనా అరెస్ట్ చేశారా? ఇదేం అరాచకమని శాంతియుతంగా నిరసన తెలిపే టిడిపి నేతల్ని అరెస్ట్ చేస్తారా? మా నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం..(1/4)#WeStandWithBrahmam pic.twitter.com/dTaM4FKFiG
— Lokesh Nara (@naralokesh) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">డిజిపి గారూ! మాపైనా, మా కార్యాలయాలపైనా దాడిచేసినోళ్లలో ఒక్కడినైనా అరెస్ట్ చేశారా? ఇదేం అరాచకమని శాంతియుతంగా నిరసన తెలిపే టిడిపి నేతల్ని అరెస్ట్ చేస్తారా? మా నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం..(1/4)#WeStandWithBrahmam pic.twitter.com/dTaM4FKFiG
— Lokesh Nara (@naralokesh) October 21, 2021డిజిపి గారూ! మాపైనా, మా కార్యాలయాలపైనా దాడిచేసినోళ్లలో ఒక్కడినైనా అరెస్ట్ చేశారా? ఇదేం అరాచకమని శాంతియుతంగా నిరసన తెలిపే టిడిపి నేతల్ని అరెస్ట్ చేస్తారా? మా నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం..(1/4)#WeStandWithBrahmam pic.twitter.com/dTaM4FKFiG
— Lokesh Nara (@naralokesh) October 21, 2021
కొత్త డ్రామా..
పోలీసులు నాదెండ్ల బ్రహ్మంని నిన్నటి నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పి..తిప్పి ఏదో చేయాలనే ప్లాన్ చేశారని...అది బెడిసికొట్టడంతో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలినా డీజీపీనే బాధ్యత వహించాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి చేసిన ప్రతీ అరెస్టుకి, పాల్పడిన ప్రతీ అరాచకానికీ న్యాయస్థానాల ముందు తలదించుకుని దోషిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు.