ETV Bharat / city

'రైతులు మాకొద్దంటున్నా.. ప్రభుత్వానికి ఎందుకంత పంతం' - నారా లకోశే తాజా వార్తలు

రైతులు వద్దంటున్నా వైకాపా ప్రభుత్వం బలవంతంగా పొలాల పంపుసెట్లకు మీటర్లు ఎందుకు బిగిస్తోందని నారా లోకేశ్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు.

nara lokesh on digital meters to agricultural fields
నారా లోకేశ్
author img

By

Published : Sep 20, 2020, 5:59 PM IST

రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రైతాంగం అంతా ఒక్కటై 'ఈ దగా మీటర్లు మాకొద్దు' అంటున్నా జగన్ రెడ్డి బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు.. మీటర్లు పెట్టడానికి మాత్రం అంగీకరించం అంటూ రైతులు ఒక పక్క ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మర్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించిన లోకేశ్​.. రైతు ఆందోళనల వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఇవీ చదవండి..

గుంటూరు జిల్లా ఆసుపత్రి అప్​గ్రేడ్.. ఉత్తర్వులిచ్చిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.