Lokesh on YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలిపోటు నుంచి గుండెపోటు డ్రామా వరకూ ఉన్న మిస్టరీ వీడిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బాబాయి వివేకానందని అత్యంత కిరాతకంగా చంపేసిన అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి.. నా రెండు కళ్లుని చెప్పడం, సీబీఐకి అప్పగిస్తే ఇది 12వ కేసు అవుతుందనడం చూస్తుంటే వివేకా హత్యకు స్కెచ్ వేసింది జగన్ రెడ్డేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వివేకా హత్యలో జగన్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: VIVEKA MURDER CASE: వివేక హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ...కడపకు సీబీఐ డీఐజీ