Lokesh Counter on Jagan : అసూయ పడేవారికి గుండె పోట్లు, బీపీలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ అసూయకు అన్నలాంటి వాడని విమర్శించారు. అందుకే నాన్న, బాబాయ్‌కి టికెట్ తీసి పంపేశాడని దుయ్యబట్టారు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడన్న లోకేశ్.. ఈ సారి గుండెపోటు తల్లికా లేక చెల్లికా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సీఎం జగన్ రెడ్డి చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతి వల్ల.. ఆయన పార్టీ నేతలూ బలవుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : CBN On Power Cuts: రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది - చంద్రబాబు