ETV Bharat / city

Lokesh: ' రెండు రోజుల్లో రూ.17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి' - విదేశీ పెట్టుబడులపై లోకేశ్ కామెంట్స్

రెండు రోజుల్లో రూ.17 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రిల‌య‌న్స్ ప్లాంటు ఏర్పాటును విరమించుకోగా..ట్రైటాన్ తెలంగాణకు వెళ్లిపోయిందన్నారు. భూమి వెన‌క్కిచ్చి రిల‌య‌న్స్ వెళ్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని లోకేశ్ ప్రశ్నించారు.

రెండేళ్లలో రూ.17 వేల కోట్లు  పెట్టుబడులు తరలిపోయాయి
nara lokesh comments on investments
author img

By

Published : Jun 25, 2021, 6:04 PM IST

Updated : Jun 25, 2021, 7:28 PM IST

వైకాపా ప్రభుత్వ మూర్ఖ వైఖరితో గత రెండు రోజుల్లో రాష్ట్రం నుంచి రూ.17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రిల‌య‌న్స్ తన ప్లాంటు ఏర్పాటును విర‌మించుకుంటే..ట్రైటాన్ తెలంగాణకు త‌ర‌లిపోయిందన్నారు. దీంతో ఏపీ రూ. 17 వేల కోట్లకు పైగా పెట్టుబ‌డులు తరలిపోవటంతో పాటు వేలాది ఉద్యోగాలను యువత కోల్పోయిందని మండిపడ్డారు. ఇప్పటికే ప్రాంక్లిన్ టెంపుల్ట‌న్‌, లులూ వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రానికి వీడ్కోలు పలికాయన్నారు. 2018లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 52 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ నాటి తెదేపా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు.

తిరుపతి సమీపంలో 150 ఎకరాల్లో 17 వేల కోట్ల‌తో ఎలక్ట్రానిక్స్ తయారీ ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేలా అంబానీని ఐటీ మంత్రిగా నేనే ఒప్పించా. జియో ఫోన్లు, సెట్​టాప్ బాక్సులు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ ప‌రిశ్ర‌మ ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు లభించేలా ఒప్పందం చేసుకున్నాం. భూములు వెన‌క్కిచ్చి మ‌రీ రిల‌య‌న్స్ ప‌రిశ్ర‌మ వెళ్లిపోతుంటే..ఏపీ స‌ర్కారు ఏం చేస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న అమెరికా సంస్థ ట్రైటాన్ తెలంగాణ‌కి త‌ర‌లిపోవ‌టంపై ఏం స‌మాధానం చెబుతారు. -లోకేశ్

తప్పుడు జాబ్ క్యాలెండర్​తో నిరుద్యోగుల్ని ముంచేసిన జగన్...ప్రైవేటు కంపెనీల‌ను త‌రిమేస్తూ వారికి ఉపాధిని దూరం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే అని జీవో తెచ్చిన జ‌గ‌న్‌.. తన సొంత బ్రాండ్ ప్రెసిడెంట్ మెడ‌ల్ విస్కీ అమ్మే సేల్స్​మేన్ ఉద్యోగాలిస్తారా ? అని ఎద్దేవా చేశారు.

తరలిపోతున్న వేల కోట్ల పరిశ్రమలు

వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో వ్యాపారం చేయలేక రూ. వేల కోట్ల పరిశ్రమలు తరలిపోతున్నాయని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రానికి కేవలం రూ. 2,114 కోట్లు మాత్రమే విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న కేంద్ర నివేదిక రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందన్నారు.

కేంద్ర నివేదిక ప్రకారం..దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఏపీకి వచ్చింది కేవలం 0.34 శాతం మాత్రమే. వాటిలోనూ అధిక శాతం తెదేపా ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలే. మిగతా రాష్ట్రాలు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తే..ఏపీకి మాత్రం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కూడా సాధించలేదు. 2014-2019మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుని ఏషియన్ పేపర్ పరిశ్రమతో కలిపి రూ.90 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం. భాగస్వామ్య సదస్సుల ద్వారా ఏటా సగటున రూ.13వేల కోట్లు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వచ్చేలా చూశాం. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు రిలయన్స్, అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ గ్రూప్, ఏషియన్ పేపర్ వంటివి వాటిని తరిమేశారు.-పట్టాభి

రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోందని పట్టాభి ఆక్షేపించారు. జే ట్యాక్స్ వసూళ్ల కోసం అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకెప్పుడూ పెట్టుబడులు పెట్టమని లులూ గ్రూప్ ప్రకటించటమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇదీచదవండి

Cases on Jagan: అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నివేదికను సమర్పించండి: హైకోర్టు

Last Updated : Jun 25, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.