కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల హక్కులు కాలరాస్తున్నాయని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ అహ్మద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను.. అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలు నిరసనకు దిగారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు దుల్హన్ పథకం కింద రూ.1 లక్ష, విదేశీ విద్యకు 15 లక్షల రూపాయలు, ఇమామ్, మోజన్లకు జీతాలు నేరుగా వారి ఖాతాతో వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలను పూర్తిగా నిలిపివేయడం దుర్మార్గామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భాజపా అధ్యక్షులు సోము వీర్రాజుకు గోవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించేలా మోదీపై ఒత్తిడి చేయాలన్నారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటే ముస్లిం లీగ్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
ఇదీ చదవండి: Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు