కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్, కేరళ, ఏపీలో భాజపాను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. దక్షిణాదిలో రాజకీయ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో... బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చేనెల 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా... దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...