విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. 38వ డివిజన్ రథం సెంటర్లో అభ్యర్థిని రెహమతున్నీసాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 38, 40వ డివిజన్లలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33వ డివిజన్లో వి.యన్.డి.ఎస్.ఎస్.మూర్తి తరఫున ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
విజయవాడ 10వ డివిజన్లో అభ్యర్థిని దేవినేని అపర్ణ తరఫున ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ కాలనీలో 10వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. వైకాపా పాలనలో వ్యక్తిగంతా నష్టపోయిన ప్రతిఒక్కరూ.. ఈ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారని నాని పేర్కొన్నారు. ఏ పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారనేది స్పష్టత వచ్చాక... రేపటి నుంచి అభ్యర్థులంతా పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండీ... పురపాలక ఎన్నికల్లో ముగిసిన మరో ఘట్టం