ETV Bharat / city

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఆన్​లైన్​ విద్య కోసం ఎంపీ సాయం - ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన ఎంపీ రంజిత్రెడ్డి

గ్రామీణ విద్యార్థులకు టీవీలు, ఫోన్లు లేక డిజిటల్​ విద్యకు దూరమవుతున్నారంటూ ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందనగా.. తెలంగాణలోని వికారాబాద్​ జిల్లా పూడూరు, దోమ మండలాల్లో ఎమ్మెల్యే మహేష్​ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్​రెడ్డి.. రెండు టీవీలను పంపిణీ చేశారు.

mp-ranjith-reddy-responded-to-etv-bharat-article-and-distributed-tvs-for-online-study

author img

By

Published : Sep 12, 2020, 9:27 PM IST

ఈటీవీ భారత్​లో గ్రామీణ విద్యార్థులకు స్మార్ట్​ ఫోన్లు, టీవీలు లేకపోగా డిజిటల్​ విద్యకు దూరమవుతున్నారని గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మహేష్​రెడ్డి.. అప్పుడే విద్యార్థులకు మహబూబ్​నగర్​ జిల్లా పగిడాల గ్రామంలో చరవాణీలు అందజేశారు. అది చూసిన ఎంపీ రంజిత్​రెడ్డి.. ప్రతి గ్రామానికి తన సొంత డబ్బులతో ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా వికారాబాద్​ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు, దోమ మండలాల్లో ఎమ్మెల్యే మహేష్​ రెడ్డితో కలిసి మండలాని ఒక్కో టీవీను పంపిణీ చేశారు.

ప్రతి విద్యార్థి చదువుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే మహేష్​రెడ్డి తెలిపారు. ఇంట్లో టీవీ లేని కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టీవీలను అందజేయనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా విద్యార్థులెవరూ చదువులు ఆపేయకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం టీశాట్​ ఛానెళ్ల ద్వారా డిజిటల్​ విద్యను నేర్పిస్తున్నారంటూ రంజిత్​రెడ్డి అన్నారు. ఐతే అందులో చాలా మంది వద్ద టీవీలు లేనందున.. వారి కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎంపీ వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.