కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగతున్నాయని ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్‌ను కోరారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయింపు చేస్తున్నారన్న రఘురామ.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. గత నెల 14న ఏపీ సీఐడీ పోలీసుల ప్రవర్తన తీరుపైనా వివరాలను గజేంద్రసింగ్కు తెలిపినట్లు సమాచారం. పోలవరం, తనతో పోలీసుల ప్రవర్తన వంటి వివరాలతో.. రెండు వేర్వేరు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Krishna River: సోమశిల వద్ద.. కృష్ణా నదిపై కొత్త వంతెనకు ప్రణాళికలు సిద్ధం!