ETV Bharat / city

రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా: ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామ తాజా వార్తలు

రాష్ట్రంలో 3 హత్యలు.. 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిందని చెప్పారు. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉందని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు
రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు
author img

By

Published : May 3, 2022, 5:12 PM IST

ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయిని..,3 హత్యలు.. 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందన్నారు. లేని చట్టాల గురించి మా పార్టీ నేతలు (వైకాపా) మాట్లాడుతారన్నారు. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉందని చెప్పారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో 2వ స్థానంలో ఉందన్నారు. మహిళలపై భౌతిక దాడుల ఘటనల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని అన్నారు.

"2019తో పోలిస్తే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతం నమోదు. ప్రతి 3 గంటలకు ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. 2021లో అత్యధిక లాకప్‌ డెత్‌లు ఏపీలోనే జరిగాయి. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా. శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదు. మద్య నిషేధంలో భాగంగా మా ప్రభుత్వం పర్మిట్‌ రూమ్‌లు తీసేసింది. 2, 3 రోజుల్లో చెదురుమదురుగా జీతాలు పడొచ్చని ఆర్థికశాఖ అంటోందని జోక్ వచ్చింది. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చినా రాష్ట్ర అప్పులు తీరవు. 175 అంటున్నాం.. చివరన 5 తీస్తే మనకు చాలా కష్టం. 175 సీట్లు రావాలంటే ప్రక్షాళన జరగాలి." -రఘురామ, ఎంపీ

ఇదీ చదవండి: విజయనగరంలో మహిళపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.