విజయవాడ వన్ టౌన్ ఆంజనేయ వాగు కూడలిలో నిర్మించిన సీసీ రోడ్డును విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. 33 లక్షల రూపాయల పార్లమెంట్ సభ్యుల నిధులతో ఈ రహదారి వేశారు. అనంతరం ఆంజనేయ వాగు సెంటర్లోనే పలు డివిజన్లలో ఆయన పాదయాత్ర చేశారు.
అమరావతి నిర్మాణంలో చేతులెత్తేసిన సీఎం జగన్.. తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధాని రైతుల త్యాగాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా స్వలాభానికి పని చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: